హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ ఆలయ ఛైర్మన్‌గా గుట్ట వెంకటరమణ

అన్నమయ్య: మదనపల్లె కనుములోని శ్రీ గంగమ్మ ఆలయ నూతన ఛైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఛైర్మన్ హామీ ఇచ్చారు.