AP: విద్యుత్ రంగ సంస్థల్లో AE ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 629 ఉద్యోగాలకు లక్షమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, పారదర్శకంగా నిర్వహిస్తున్న పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దుష్ప్రచారాలు, వదంతులను ఎవరూ నమ్మొద్దన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
ఏఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: గొట్టిపాటి


