WG: వల్లూరులో జనసేన ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం కేక్ కట్ చేసి, గ్రామంలోని నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. DyCM పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఏడాది కాలంగా ప్రతి నెలా పేదలకు సరుకులు అందజేస్తున్నట్లు సొసైటీ ఛైర్మన్ తాతాజీ మాట్లాడారు. జనసేన నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిరంజీవి బర్త్ డే వేడుకలు..పేదలకు సరకులు


