KRNL: ఎమ్మిగనూరు దళితపేటలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోవిందు, రాముడు శనివారం డిమాండ్ చేశారు. సమస్యలపై కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్, స్మశానవాటికకు కాంపౌండ్ వాల్, బోరు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
దళితపేట సమస్యలు పరిష్కరించాలి: KVPS


