హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగరాజు వర్ధంతి.. నివాళులర్పించిన సీపీఐ

W.G: స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ జర్నలిస్ట్, చేనేత కార్మిక సంఘ నాయకుడు గంగరాజు వర్ధంతి శనివారం నరసాపురం మంగినవారి నగర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి CPI, AITUC పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు ఎందరికో ఆదర్శప్రాయమని నాయకులు స్మరించుకున్నారు.