హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్‌ పనులపై మంత్రి ఆగ్రహం'

SKLM: వంశధార శాఖకు చెందిన షట్టర్ పనులు పెండింగ్‌లో ఉండటంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పనుల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వస్తున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.