హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాలీబాల్ ఆటలో ఘర్షణ.. వ్యక్తికి గాయాలు

PPM: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురంలో వాలీబాల్ ఆడుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ప్రదీప్ అనే వ్యక్తిపై వంశీ అనే వ్యక్తి రాడ్‌తో దాడి చేయడంతో గాయాలయ్యాయి. ప్రదీప్‌ను వెంటనే భద్రగిరి సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.