హైదరాబాద్: 28°C
వార్తలు

వేల ఎకరాలు దోచుకోవడానికే భూ భారతి: జగదీష్ రెడ్డి

TG: నాగార్జున సాగర్‌లో నీళ్లు ఉన్నా రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇంతకంటే తక్కువ నీళ్లు ఉన్నా రైతులకు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌ది అని కొనియాడారు. ఏపీ నీళ్లు దోచుకెళ్తుండే ఇద్దరు మంత్రులు పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు వేల ఎకరాలు దోచుకోవడానికే భూ భారతిని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.