హైదరాబాద్: 28°C
వార్తలు

అత్యాచారం కేసులో రూ.5 కోట్ల డిమాండ్?

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్య గుర్రీప్రీత్ కౌర్‌పై మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచారం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.5కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన NHRC, 2వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలని పంజాబ్ సీఎస్, డీజీపీని ఆదేశించింది. అయితే ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు.