హైదరాబాద్: 28°C
వార్తలు

QR కోడ్‌తో వసూళ్లా?

TG: పటాన్‌చెరులో ట్రాఫిక్ పోలీసులపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. నేరుగా నగదు తీసుకోకుండా పండ్ల వ్యాపారులు, పాన్‌ డబ్బాలు, పెట్రోల్‌ బంకుల వద్ద ఉన్న QR కోడ్‌లకు PhonePe ద్వారా డబ్బులు పంపిస్తున్నారంటూ వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.