హైదరాబాద్: 28°C
వార్తలు

విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు వేగంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 20 నాటికి 1,777 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 200 H1N1 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 8 రెట్లు పెరిగాయి. ప్రతీ 20 మంది ఓపిడి రోగులలో దాదాపు 15 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.