హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్సై

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి శారీరకంగా దగ్గరై, అనంతరం పెళ్లికి నిరాకరించిన ఎస్సైపై కేసు నమోదైంది. 2025లో 29 ఏళ్ల ఢిల్లీ యువతికి ఎస్సై లలిత్ మోహన్ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను మీరట్‌కు పిలిచి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి గురించి ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.