హైదరాబాద్: 28°C
వార్తలు

తామర సాగు.. ఆలోచన బాగు

AP: తూర్పుగోదావరి జిల్లా కొత్తతుంగపాడుకు చెందిన తండ్రీకొమారులు వీరబాబు, గంగాధర్‌ వరికి ప్రత్యామ్నాయంగా ఎకరం పొలంలో తామరపూల సాగు చేపట్టారు. మన్యం నుంచి విత్తనాలు తెచ్చి బోరు నీటితో సాగు చేయగా జులై నుంచి పూలు పూస్తున్నాయి. పరిమాణాన్ని బట్టి ఒక్కో పువ్వును రూ. 10 నుంచి రూ. 30 వరకు అమ్ముతూ ఇప్పటివరకు 2,000 పూలు విక్రయించారు.