హైదరాబాద్: 28°C
వార్తలు

అడ్వొకేట్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు గ్రీన్‌సిగ్నల్‌

TG: న్యాయవాద వృత్తిలో చేరాలనుకునే లా గ్రాడ్యుయేట్లకు ఊరటనిస్తూ అడ్వొకేట్ ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియకు హైకోర్టు సీజే ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, బార్ కౌన్సిల్ సోమవారం నుంచి ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించనుంది.