హైదరాబాద్: 28°C
వార్తలు

గోల్కొండ సమీపంలో వెలుగుచూసిన సొరంగం

TG: గోల్కొండ కోటకు సమీపంలోని అఠ్ఠారాసీడీ ప్రాంతంలో కుతుబ్‌షాహీ కాలంనాటి పురాతన సొరంగం బయటపడింది. ఆర్టిలరీ అధికారులు భూమిని చదును చేస్తుండగా ఈ మార్గం వెలుగుచూసింది. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే పనులు నిలిపివేసి, కేంద్ర పురావస్తు శాఖకు సమాచారం అందించారు. స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు అక్కడ భద్రతా చర్యలు చేపట్టారు.