కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ పోలీసు స్టేషన్ వెలుపల చేపట్టిన నిరసనపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది విద్యార్థుల సమస్యల కోసం కాదని, కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికేనని ఆరోపించారు. కెమెరాల ముందు కూర్చుని నిరసన తెలపడం రాహుల్ నైరాశ్యాన్ని, న్యాయవ్యవస్థపై ఆయనకు ఉన్న అపనమ్మకాన్ని తెలపడమేనని విమర్శించారు.
వార్తలు
'మీడియా ప్రచారం కోసమే రాహుల్ గాంధీ నిరసన'


