హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు నేరుగా పీహెచ్‌డీ ప్రవేశాలు

ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో కీలక సంస్కరణలు తెచ్చింది. NEP-2020 మార్గదర్శకాల ప్రకారం, నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (FYUP) పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేయకుండానే నేరుగా PHDలో ప్రవేశం పొందవచ్చని ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 7.5 CGPA(ఎస్సీ, ఎస్టీలకు 7) సాధించిన అర్హులైన విద్యార్థులకు ఈ డైరెక్ట్ PHD అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది.