హైదరాబాద్: 28°C
వార్తలు

CGL, CDPO పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే

జార్ఖండ్‌లో CGL, CDPO పరీక్షల రద్దు అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. JSSC నిర్వహించిన CGL, CDPO నియామక పరీక్షల రద్దుపై జార్ఖండ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రభుత్వ నిర్ణయ అమలును నిలిపివేస్తూ ఆదేశించింది. దీంతో అభ్యర్థులకు ఊరట లభించింది.