హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి'

అనంతపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ ఎల్. నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే జనతా వారధి లక్ష్యమని తెలిపారు.