హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టుబట్టిన రాహుల్.. FIR నమోదు

ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో పెల్లెట్ గన్ వల్ల గాయపడిన బాధితుడితో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి FIR నమోదు చేయాలని కోరారు. అయితే రాహుల్‌ డిమాండ్‌ను పోలీసులు తిరస్కరించడంతో FIR నమోదు చేసేవరకు కదిలేదిలేదంటూ రాహుల్ ధర్నాకు దిగారు. చివరికి FIR నమోదు చేయడంతో రాహుల్ దీక్ష విరమించారు.