హైదరాబాద్: 28°C
వార్తలు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

WGL: వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గంగారపు శ్రీనివాస్, స్వరూప దంపతులకు ఒక్కరే కుమార్తె రమ్య. కుమారులు లేకపోవడంతో తండ్రి శ్రీనివాస్ అంత్యక్రియలను కుమార్తె రమ్య నిర్వహించి తలకొరివి పెట్టింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, రమ్యను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.