హైదరాబాద్: 28°C
వార్తలు

పిజ్జా డెలివరీలో తప్పు.. రూ.10 వేల ఫైన్

పిజ్జా డెలివరీ విషయంలో ఓ యాప్, కేఫ్‌పై వినియోగదారుల కమిషన్ రూ.10,520 జరిమానా విధించింది. ఉత్తరఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన రాజ్ అనే వ్యక్తి 2020 మార్చి 10న రూ.505తో పిజ్జా ఆర్డర్ పెట్టాడు. అయితే, అతను ఆర్డర్ చేసిన దానికి తక్కువ పరిమాణంలో పిజ్జా వచ్చింది. అతడు కేఫ్‌ను సంప్రదించగా వారు డబ్బులు రిఫండ్ చేయలేదు. దీంతో అతడు వినియోగదారుల కమిషన్ ఆశ్రయించాడు.