హైదరాబాద్: 28°C
వార్తలు

'రోజుకు రెండు షిఫ్టుల్లో ఏఈఈ పరీక్షలు'

GNTR: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పీ.పుల్లారెడ్డి తెలిపారు. 1.05 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.