హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెన్సీ నోట్లతో గంగమ్మ తల్లి అలంకరణ

CTR: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పలమనేరులోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. స్థానిక శ్రీ సత్య గంగమ్మ దేవాలయంలో అమ్మవారిని రూ.3 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకురాలు మీనాక్షి మాట్లాడుతూ, రూ.500 నోట్లతో దాదాపు 6 గంటలు శ్రమించి అలంకరణ పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.