హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

VZM: ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాంప్రసాద్‌ దంపతుల కుమార్తె వివాహం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఎల్‌.కోటకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి కాబోయే వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శుక్రవారం పరిశీలించారు.