కృష్ణ: ఉంగుటూరులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు నల్లూరి రామకృష్ణాచారి ఇంట్లో సుమారు రూ.80 లక్షల విలువైన బంగారం, వెండి చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఘటనపై ఉంగుటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు, అపహరణకు గురైన బంగారం విలువపై పోలీసులు అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
భారీ చోరీ.. రూ.80 లక్షల సొత్తు అపహరణ


