ASR: కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విమర్శించారు. పాడేరులో శుక్రవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అబద్ధాలతో అధికారం చేపట్టారని, ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలను మోసం చేయడంలో దిట్ట'


