హైదరాబాద్: 28°C
వార్తలు

ఈరన్న స్వామి హుండీ ఆదాయం ఎంతంటే.!

KRNL: కౌతాళం మం. ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ, ఈరన్న స్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా ఇవాళ హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఆలయ ఈవో కే.వాణి తెలిపారు. సాధారణ హుండీ ద్వారా రూ.84,36,480, అన్నదానం హుండీ ద్వారా రూ.12,17,458 కలిపి మొత్తం రూ.96,53,938 ఆదాయం లభించిందన్నారు. అదనంగా 6.300 గ్రాముల బంగారం, 13.450 కిలోల వెండి లభించినట్లు తెలిపారు.