హైదరాబాద్: 28°C
వార్తలు

105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టు ఉపశమనం

ఓ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌నే అంతిమ నిర్ణయంగా పేర్కొంది. బెంగాల్‌కు చెందిన రసిక్ చంద్ర (105) నలభై ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. 1994లో అతడికి న్యాయస్థానం శిక్ష విధించింది.