హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరుపేదల ఆరోగ్యమే లక్ష్యం'

SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళంలోని తన నివాస గృహంలో శుక్రవారం సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు.