KDP: ఖాజీపేట మండలంలోని తవ్వారుపల్లి, పత్తూరు, ఈబీసీ కాలనీల్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లు నాలుగేళ్లుగా పనిచేయడం లేదు. దీంతో ప్రజలు బయట నుంచి రూ.20కు క్యాన్ నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్లాంట్లను పునరుద్ధరించి సురక్షిత తాగునీటిని అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగేళ్లుగా మూతపడిన మినరల్ వాటర్ ప్లాంట్లు


