హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

AKP: ఎ.కోడూరులో జరిగే "స్వర్ణాంధ్ర-స్వచ్ఛంధ్ర" సభకు శనివారం సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి ఎ.కోడూరు మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. భారీ వాహనాలను కొత్తవలస, లంకవానిపాలెం వైపు మళ్లించినట్లు వెల్లడించారు. సభకు వచ్చేవారు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని, రోడ్లపై వాహనాలు నిలపరాదని స్పష్టం చేశారు.