KDP: తొండూరు మండలం మల్లెల ఘాట్లో శుక్రవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో లారీల ముందు భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదు. లారీలు రోడ్డుకు అడ్డంగా నిలవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు లారీలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
మల్లెల ఘాట్లో రెండు లారీలు ఢీ


