హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు

ఉత్తరాఖండ్‌లో మసూరి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇల్లు, దుకాణం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రతను ముందుగానే గమనించిన కుటుంబసభ్యులు సకాలంలో బయటకు పరుగెత్తడంతో ప్రాణనష్టం తప్పింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.