దేశీయ విమానయాన సంస్థ 'ఇండిగో' వెబ్‌సైట్‌లో మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తింది. వారం వ్యవధిలోనే వెబ్‌సైట్ మొరాయించడం ఇది రెండోసారి. ఫ్లైట్ సెర్చ్, బుకింగ్ కోసం ప్రయత్నించే ప్రయాణికులకు 'డేటా అందుబాటులో లేదు' అనే మెసేజ్ దర్శనమిస్తోంది. కాగా, ఈనెల 19న కూడా తమ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి సమస్యే ఎదురైందని ఇండిగో వెల్లడించింది.
వార్తలు
ఇండిగో వెబ్‌సైట్‌లో మళ్లీ సమస్య


