హైదరాబాద్: 28°C
వార్తలు

డీసీపీ ఆఫీస్ ఎదుట బైఠాయించిన రాహుల్

ఢిల్లీలో సంసద్ మార్గ్ పీఎస్ వద్ద హైడ్రామా నెలకొంది. విద్యార్థులపై పెల్లెట్స్ ప్రయోగాన్ని నిరసిస్తూ ఫిర్యాదు చేసేందుకు బాధితులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం, FIR నమోదు చేయకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా డీసీపీ ఆఫీస్ ఎదుట బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. వెంటనే కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు.