కల్తీ నూనెల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విడిగా వంట నూనెల విక్రయాలపై నిషేధం విధించింది. కేవలం సీల్ చేసిన ప్యాకెట్లలోనే నూనెను విక్రయించాలని ఆదేశించింది. ఇటీవల 1247 శాంపిల్స్‌లో 77 నాసిరకం, 13 కల్తీవని తేలింది. దీంతో 497 నూనె తయారీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
వార్తలు
కల్తీ నూనెపై మహారాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం


