హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీ ఫ్యాన్ అని పెళ్లి రిజెక్ట్!

రూ.40L ప్యాకేజీ, చూడటానికి అందంగా ఉన్న యువకుడి పెళ్లి సంబంధాన్ని ఓ యువతి తిరస్కరించింది. అతడి ఇన్‌స్టా బయోలో 'రాహుల్ గాంధీ' తన రోల్ మోడల్ అని ఉండటమే కారణం. 'X' వేదికగా ఆరూహి రెడ్డి అనే యువతి ఈ విషయాన్ని పంచుకుంది. పదేపదే ఓడిపోయే వ్యక్తిని ఆదర్శంగా తీసుకునేవారి IQ స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని.. తన దేశం, ధర్మమే తనకు ముఖ్యమని ఆమె చేసిన ట్వీట్ SMలో వైరల్ అవుతోంది.