హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 44,730 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.80 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 TMCలు కాగా, ప్రస్తుతం 167.48 TMCలు ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి సాగుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా 82,368 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.