హైదరాబాద్: 28°C
వార్తలు

బెంగాల్‌లో నేడు అమిత్ షా పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ, రేపు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా సిలిగురిలో ఏర్పాటు చేసిన పలు సరిహద్దు భద్రతా ప్రాజెక్టులను అమిత్ షా లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే సభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.