హైదరాబాద్: 28°C
వార్తలు

లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

TG: కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై దువ్వల ఆంజనేయులు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బెయిల్ ఇవ్వడానికి, ఛార్జిషీట్‌లో తక్కువ శిక్ష పడే సెక్షన్లు చేర్చడానికి ఆయన బాధితుడిని లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్సైని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.