TG: ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ అభ్యంతరాల గడువును DEC 31 వరకు పొడిగించాలని పౌరసంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో 90 లక్షల మంది వివరాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఫారం-8ని అందుబాటులో ఉంచాలని, విదేశాల్లో ఉన్నవారు, వృద్ధుల తరఫున కుటుంబసభ్యులు పత్రాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని కోరారు.
వార్తలు
ఎన్నికల సంఘానికి పౌరసంఘాల డిమాండ్


