మహాత్మా గాంధీ స్వహస్తాలతో తన స్నేహితుడు ఆనంద్ టీ.హింగోరాణికి రాసిన 688 చేతిరాత ప్రతులను సాఫ్రోన్ ఆర్ట్ గ్యాలరీ ఇటీవల వేలం వేసింది. ఈ వేలంలో అవి రూ.16.2 కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే, వేలంలో అత్యధిక ధర పలికిన భారతీయ ప్రతులుగా ఇవి రికార్డు సృష్టించాయి. భార్య మరణం తర్వాత గాంధీజీ పంపిన ఈ సందేశాలను హింగోరాణి సత్యం, అహింస, సేవ అనే అంశాలపై 'ఎ థాట్ ఫర్ ది డే' పుస్తకంగా ముద్రించారు.
వార్తలు
గాంధీ చేతిరాత ప్రతులకు వేలంలో భారీ ధర!


