హైదరాబాద్: 28°C
వార్తలు

బంగ్లా ప్రధాని భారత్ పర్యటన రద్దు.?

వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సమావేశానికి బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ హాజరుకావడంపై అనిశ్చితి నెలకొంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పర నమ్మకం ఏర్పడితేనే ఈ పర్యటనపై స్పష్టత వస్తుందని ఆ దేశ విదేశాంగ సలహాదారు పేర్కొన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత డిమాండ్, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన జరిగే అవకాశం చాలా తక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు.