హైదరాబాద్: 28°C
వార్తలు

చక్కెర దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ తొలగింపు

గత రెండు నెలల్లో దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు దాదాపు 40 శాతం వరకు పెరిగాయి. దీంతో ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతికి అనుమతి ఇచ్చింది. అలాగే, చక్కెర దిగుమతులపై ఉన్న 100 శాతం కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించింది. కాగా, దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో చక్కెరను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి.