హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: పట్టణంలో అభివృద్ధి పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈఈ జీ.సాంబరెడ్డి తెలిపారు. వడ్డేపల్లి సబ్జెస్టేషన్ పరిధిలో స్నేహనగర్ ఫీడర్‌కు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, పరిమళకాలనీ ఫీడర్‌కు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.