PPM: గుమ్మలక్ష్మీపురం మండలం పెద్దగూడ కంటైనర్ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందట్లేదని స్థానికులు తెలిపారు. మారుమూల గిరిజన గ్రామాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు అందట్లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వారంలో ఒక్కసారైన డాక్టర్ వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
కంటైనర్ ఆసుపత్రి ఉంది.. వైద్యుడే లేడు..!


