హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్మీకి క్షమాపణలు చెప్పిన యువతి

లద్దాఖ్‌లోని ఓ చెక్‌పోస్టు వద్ద భద్రతా సిబ్బందితో ఓ పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాము 'జెన్ జీ' తరానికి చెందిన వారమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆ యువతి భారత ఆర్మీకి తాజాగా క్షమాపణలు చెప్పింది. తన వ్యాఖ్యల పట్ల విచారిస్తున్నట్లు తెలిపింది. భద్రతా బలగాలను అవమానించాలని, ఈ ఘటన ద్వారా తాను పాపులర్ కావాలని అనుకోలేదన్నారు.