హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి హామీ పనులు కల్పించాలని ధర్నా

PLD: వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జీ.రవిబాబు డిమాండ్‌ చేశారు. నరసరావుపేట MDO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పేదలు, దళితులు, గిరిజనులకు పనుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పనులు కల్పించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామన్నారు.