హైదరాబాద్: 28°C
వార్తలు

సమ్మెకు సహకరించాలని డీఎస్పీకి వినతి

NGKL: ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల సమ్మెకు సహకరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి కరపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులిజాల పరశురాం, ఆటో యూనియన్ అధ్యక్షులు దేశం సైదులు, మహేష్ పాల్గొన్నారు.